హోదా ఉద్య‌మంలో శివ‌ప్ర‌సాద్ శైలే భిన్నం..!

-

రాష్ట్ర రాజ‌కీయాల్లో ముఖ్యంగా టీడీపీ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్య‌క‌త‌ను చాటుకున్న చిత్తూరు మాజీ ఎంపీ నారిమిల్లి శివ‌ప్ర‌సాద్ శ‌నివారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. గ‌త కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌నకు కిడ్నీ స‌మ‌స్య త‌లెత్తింది. ఈ క్ర‌మంలో నే చెన్నై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న శ‌నివారం మృతి చెందారు. రాజ‌కీయాల్లోను సినిమాల్లోనూ .. అంత‌కు మించి రంగ స్థ‌లంపైనా త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో దూసుకుపోయిన శివ‌ప్ర‌సాద్ ప్ర‌స్థానం టీడీపీలోనే కాకుండా తెలుగు రాజ‌కీయాల్లోనే స‌రికొత్త క‌ళ‌ను సంత‌రించుకుంది.

ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం తెలంగాణ ఎంపీలు ఉద్య‌మ‌బాట ప‌ట్టిన‌ప్పు డు నిత్యం శివ‌ప్ర‌సాద్ త‌న‌దైన శైలిలో హోదా అవ‌స‌రాన్ని చెబుతూ.. వార్త‌ల్లో నిలిచారు. త‌న‌లోని విల‌క్ష‌ణ న‌టుడిని హోదా కోసం బ‌య‌ట‌కు తీశారు. అంబేడ్క‌ర్ వేషం వేసినా, వృద్ధ‌నారి వేషంలో అల‌రించినా, మ‌హాత్మాగాంధీ వేషం ధ‌రించినా.. మాయ‌ల‌ప‌కీరు వేషం వేసినా.. స‌త్య‌సాయి బాబా వేషం ధ‌రించినా.. ఆయ‌న దృష్టి మొత్తం పార్ల‌మెంటులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని, ఆయ‌న అనుచ‌ర గ‌ణాన్ని ఆక‌ర్షించ‌డంలోని భాగ‌మే ఈ క్ర‌మంలోనే ఆయ‌న విప‌క్షాల నుంచి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టారు. ఒకానొక సంద‌ర్భంలో శివ‌ప్ర‌సాద్ వేస్తున్న వేషాల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ప్ర‌త్యేక హోదా కోసం ఈ చిల్ల‌ర‌మ‌ల్ల‌ర వేషాలు ఎందుకంటూ.. ఏకంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌నే వ్యాఖ్యా నించడం అప్ప‌ట్లో వివాదానికి తెర‌దీసింది. అయిన‌ప్ప‌టికీ..త న‌ను తాను స‌మ‌ర్ధించుకున్నారు. ముందు నేను న‌టుడిని.. త‌ర్వాతే రాజకీయాలు.. అంటూ.. క‌ళామ‌త‌ల్లికే పెద్ద‌పీట వేశారు శివ‌ప్ర‌సాద్‌. చిత్తూరు ఎంపీగా ఉంటూనే చిన్న‌పాటి నాటిక‌లు, నాట‌కాల‌కు ఆయ‌న ప్రాణం పోశారు. స‌మాజ చైత‌న్యం కోసం ఆయ‌న అనేక భిన్న‌మైన వేషాలు వేశారు.

మొత్తంగా రాజ‌కీయ‌న నాయకుడిగా బిజీగా ఉంటూనే త‌న జీవితంలోని కొంత విలువైన స‌మ‌యాన్ని ఆయ‌న అటు కుటుంబానికి ఇటు క‌ళామ‌త‌ల్లి సేవ‌కు కూడా అంకితం చేశారు. ఇలాంటివిల‌క్ష‌ణ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడుని మ‌ళ్లీ చూస్తామ‌నే ఆశ‌లేద‌ని అంటున్న టీడీపీ నేత‌ల మాట‌ల్లో వాస్త‌వం ఎంతైనా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news