బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆస్తుల వివరాలు తెలుసా…

-

లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బిగ్ ఫైట్ నడుస్తోంది. నేటితో నామినేషన్ల స్వీకరణ కూడా ముగిసింది. వారు సమర్పించిన నామ పత్రాల్లో ఆస్తుల వివరాలు పెద్ద మొత్తంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.భారతీయ జనతా పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈమె.

ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ ను చుట్టేస్తున్నారు మాధవీలత. ఆమె తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను ప్రకటించారు. స్థిరచరాస్తులన్నీకలిపి 218కోట్లు అని పేర్కొన్నారు. చరాస్తుల విలువ 165.46కోట్లు …స్థిరాస్తుల విలువ 55.92 కోట్లు ఉన్నట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు.

అలాగే, 27.03కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు ప్రకటించారు. విరించి లిమిటెడ్ లో తన పేరిట 8.92 కోట్ల విలువైన షేర్లు, మాధవీలత భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట 56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని తెలిపారు. అన్ లిస్టెడ్ కంపెనీలైన పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్,గజ్వేల్ డెవలపర్స్ లో తన పేరిట రూ. 16.27 కోట్ల షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరిట వ్యవసాయ భూములు, వాహనాలు ఏమి లేవన్నారు. తన పేరిట ఓ క్రిమినల్ కేసు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్ లో మాధవీలత పేర్కొన్నారు.

ఇటీవల ప్రచారంలో మస్జీద్ పై విల్లు ఎక్కుపెట్టినట్లు ఇచ్చిన ఫోజు కాస్త దుమారం రేపింది. దీనిపై ముస్లిం పెద్దలు ఖండన కూడా తెలియజేసారు.తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్న మాధవీలత అప్పుడే ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం ఏంటని కొందరు విమర్శలు చేశారు. అయితే వాటిని పట్టించుకోకుండా మాధవీలత తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతోంది.హైద్రాబాద్ లో బీజేపీ గెలుపు తధ్యమని ఆమె ధీమా వ్యక్తపరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news