సీఎం జగన్ పై దాడి కేసు..ఏ2 ఎవరు !

-

విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు సీఎం జగన్ పై రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడు సతీశ్‌కు తొలి రోజు పోలీసుల కస్టడీ ముగిసింది. ఈ కేసులో మరింతగా విచారించాలన్న కోర్టు అనుమతితో సతీశ్‌ను కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు.

ఏ2తో పాటు మరికొందరి పాత్రపైనా విచారించారు. ఏ2 ప్రోద్బలంతోనే సతీశ్ దాడి చేశారని పోలీసుల రిమాండ్ రిపోర్టులో దాఖలు చేసిన అంశాలపైనా సతీశ్‌ను ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో సతీశ్‌ను ఇవాళ మళ్లీ జైలుకు తరలించారు. తొలి రోజు కస్టడీలో సతీశ్ పలు అంశాలు చెప్పినట్లు సమాచారం. దీంతో ఏ2 ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

కాగా విజయవాడలో జగన్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై గులకరాయితో దాడి చేసిన నిందితుడు సతీశ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేముల సతీశ్‌తో సంబంధమున్న వేముల దుర్గారావును విచారించి వదిలిపెట్టారు. అయితే నిందితుడిని మరింతగా విచారించేందుకు 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతించింది. దీంతో వేముల సతీశ్‌ను లాయర్ సమక్షంలో గురువారం కస్టడీలోకి తీసుకుని విచారించారు.

Read more RELATED
Recommended to you

Latest news