దసరా ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలో కొందరు నిర్వాహకులు దాండియా ఈవెంట్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో యువతీయువకులు అధికంగా పార్టిసిపేట్ చేస్తుంటారు. దీనికోసం చాలా రోజులుగా ప్రాక్టీస్ చేసి..స్పెషల్ డ్రెస్‌కోడ్‌తో దాండియా ఆడి పాడుతారు.ఇలా దుర్గా నవరాత్రులను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దాండియా ప్రోగ్రామ్స్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కోసం ఈవెంట్ల నిర్వహకులు బౌన్సర్లను నియమించుకుంటున్నారు.
అయితే, అన్యమతస్తులైన బౌన్సర్లు, సిబ్బందిని తీసుకోవద్దని దాండియా నిర్వాహకులను తెలంగాణ భజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు కోరారు.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే దాండియాకు ఎంతో ప్రత్యేకత ఉందన్న ఆయన..కొందరు ఈ వేడుకలను ఆసరాగా చేసుకుని లవ్ జిహాద్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్య మతస్తులను బౌన్సర్లుగా నియమిస్తే లవ్ జిహాద్‌కు అవకాశం ఇచ్చినట్లవుతుందని పేర్కొన్నారు. అందుకే నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, అన్యమతస్తులకు ప్రవేశం ఇవ్వొద్దన్నారు. లేనియెడల భజరంగ్ దళ్ కార్యకర్తలు దాండియా ఈవెంట్లను అడ్డుకుంటారని హెచ్చరించారు.