ED notices to former HCA president Azharuddin: HCA మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కు ఈడి నోటీసులు జారీ అయ్యాయి. గతంలో ఉప్పల్ పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడి. 2020 – 2023 మధ్యలో హెచ్సీఏ లో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు అందాయని సమాచారం.
3.8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయట. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలు లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారట. ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ పొందారు HCA మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్. ఈ తరుణంలోనే.. తాజాగా అజారుద్దీన్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. మరి దీనిపై HCA మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఎలా స్పందిస్తారో చూడాలి.