తోడేళ్ల దాడి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఈట‌ల ఢిల్లీ వెళ్లార‌ట‌..

ఈట‌ల రాజేంద‌ర్ చుట్టూ ఇప్పుడు హాట్ పాలిటిక్స్ నెల‌కొన్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న ఏ పార్టీలో
చేర‌తారో అని అంతా ఆస‌క్తిగా ఎద‌రుచూశారు. వ‌రుస‌గా కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. కానీ ఫైనల్‌గా ఆయ‌న బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై దాసోజు శ్ర‌వ‌ణ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

టీఆర్ఎస్ తోడేళ్ల దాడిని తప్పించుకోవడానికే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారని ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. కేసీఆర్ త‌న బ‌లం ఉప‌యోగించి పోలీస్, రెవెన్యూ అధికారులతో ఈటలను వేధిస్తున్నాడ‌ని చెప్పారు.

ఆ దాడి నుంచి తప్పించుకోడానికే ఈటల ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే బీజేపీవైపు చూస్తున్నారని, కేంద్రం అండ కోస‌మే వెళ్తున్నారంటూ వెల్ల‌డించారు. కేసీఆర్ త‌న ఆధిపత్యం కోసం ఈటలతోపాటు ఆయన భార్య, కొడుకు, కోడలిపై కేసులు న‌మోదు చేస్తున్నారంటూ ఆరోపించారు. టీఆర్ ఎస్‌లో ఉద్య‌మ కారుల‌కు విలువ‌లేద‌ని, వ్య‌తిరేకుల‌కే ఉంద‌ని ఆవేద‌న చెందారు.