ఆ వైసీపీ లీడర్ రాజకీయానికి ఎండ్ కార్డ్…

-

ఏపీ రాజకీయ రాజధాని విజయవాడలో అధికార వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న గౌతంరెడ్డి రాజకీయ జీవితం ముగింపు దశకు చేరుకున్నట్లు కనపడుతోంది. పార్టీ అధికారంలో ఉన్న ఆయన పరిస్తితి దారుణంగా ఉంది. మొన్నటివరకు వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆయన…నోటి దూల కారణంగా తన రాజకీయ జీవితాన్ని మధ్యలోనే ముగించేసే స్థితికి వచ్చేశారు. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన గౌతంరెడ్డి…ఆ తర్వాత వైసీపీలో చేరి ముఖ్యనేతగా వ్యవహరించారు.

ఇక 2014లో వైసీపీ తరుపున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత గౌతంరెడ్డి పార్టీలో ఎలాంటి సంచలనాలు సృష్టించారో అందరికీ తెలుసు. దివంగత వంగవీటి రంగా పై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలపై అదే పార్టీలో ఉన్న రంగా తనయుడు రాధా తీవ్రం స్పందిస్తూ…గౌతంని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జగన్ ని డిమాండ్ కూడా చేశారు. కానీ జగన్ కు దగ్గర బంధువు కావడంతో ఆ పని చేయలేకపోయారు.

ఈ క్రమంలోనే మొన్న ఎన్నికల ముందు గౌతం రెడ్డి ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  పాలిచ్చే ఆవును వాడుకుని వదిలేసినట్టు ముస్లింలు తమ భార్యలను వాడుకుని వదిలేస్తారు..” అంటూ ట్రిపుల్ తలాఖ్‌పై.. ఓ టీవీ చానల్‌లో జరిగిన చర్చ కార్యక్రమంలో రచ్చ చేశారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన వైసీపీ అధిష్టానం గౌతంరెడ్డిని సస్పెండ్ చేసింది. ఇక ఈ సస్పెన్షన్ ఎక్కువ కాలం నడవలేదు. వెంటనే ఆయనపై సస్పెన్షన్ ఎత్తేసి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారు.

అయితే ఎన్నికల్లో పార్టీ గెలవడం అధికారంలోకి రావడంతో గౌతం రెడ్డి నామినేట్ పదవి కావాలని జగన్ పై ఒత్తిడి తెస్తున్నారు. కానీ గతంలో గౌతం చేసిన రచ్చ, ప్రస్తుత సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో విభేదాలు ఉన్న కారణంగా ఆయనకు పదవి ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వాణిజ్య వ‌ర్గాల వైసీపీ ప్రెసిడెంట్‌గా ఉన్న గౌతంరెడ్డికి నామినేట్ పదవి ఇస్తే ఇంకా రచ్చ చేస్తారని వైసీపీ వర్గాలు జగన్ కు నివేదికలు ఇచ్చాయట. దీంతో ఆయనకు ఏ పదవి ఇవ్వరని అర్ధమైపోతుంది. మొత్తం మీద గౌతంరెడ్డి రాజకీయ భవిష్యత్ శూన్యమైపోయేట్లే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news