కేసీఆర్‌పై ఈటల..కేటీఆర్‌పై బండి..సాధ్యమేనా?

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా కొన్ని రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాల కంటే ముందే ఉన్న బి‌ఆర్‌ఎస్..అభ్యర్ధులని ప్రకటించింది. ఇక బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులకు ధీటుగా కాంగ్రెస్, బి‌జే‌పిలు సైతం అభ్యర్ధులని ప్రకటించే విషయంలో కాస్త ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.

ఇంకా సర్వేల ఆధారంగా వారిలో బలమైన అభ్యర్ధులని అధిష్టానం ఫైనల్ చేయనుంది. ఇటు బి‌జే‌పి సైతం తమకు పట్టున్న స్థానాల్లో బలమైన అభ్యర్ధులని నిలబెట్టేందుకు చూస్తుంది. బి‌జే‌పి సైతం మొదట లిస్ట్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సమాచారం బయటకొచ్చి. బి‌ఆర్‌ఎస్ లోకి కీలక నేతలపై బి‌జే‌పి నుంచి సైతం టాప్ లీడర్లు పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది. అందులో భాగంగా మొదట నుంచి గజ్వేల్ లో కే‌సి‌ఆర్ పై తాను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ చెబుతూనే ఉన్నారు.

దీంతో గజ్వేల్ లో ఈటలని బి‌జే‌పి నుంచి బరిలో దింపుతారని టాక్. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా కే‌సి‌ఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ని బరిలో దింపుతారని అంటున్నారు. ఇక ఇటు సిరిసిల్లలో కే‌టి‌ఆర్ పై బండి సంజయ్‌ని పోటీ చేయిస్తారని ప్రచారం వస్తుంది.

అలాగే సిద్ధిపేటలో హరీష్ రావుపై బూర నర్సయ్య గౌడ్,  మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే..ఇది వాస్తవ రూపం దాల్చడం కాస్త కష్టమే. ఎందుకంటే కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్, హరీష్ లపై పోటీ చేసి గెలవడం అనేది ఈజీ కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version