ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టాక అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తల పెట్టడం జరిగింది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అనేక సమస్యలు ఉన్నా గాని జగన్ ప్రవేశపెడుతున్న ప్రతి పథకం దేశ స్థాయిలో మంచి పేరు సంపాదించుకుంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ పరిపాలన పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం జగన్ ప్రవేశపెట్టిన ప్రతి ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని టార్గెట్ చేసుకుని జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్లు ప్రజాక్షేత్రంలో సొంత కొంప ముంచుతున్నట్లు చేస్తున్నాయి. మేటర్ లోకి వెళితే ఇటీవల సీఎం జగన్ ప్రవేశ పెట్టిన “జగనన్న గోరుముద్ద” పథకం తో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకి వారి రోజువారీ మెనులలో మార్పులు చేసి మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే రాష్ట్రం అంతటా అమలులో ఉండే ఈ పథకంలో ఏదో ఒక తప్పు వెతకటానికి ప్రయత్నాలు చేస్తూ జగన్ ని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు నవ్వులు పాలవుతున్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం ఏపీలో జగన్ పరిపాలనకు జనం నుండి మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలో మరోపక్క పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకోవటం తో ఏపీ ప్రజలకు జనసేన పార్టీ పైన విరక్తి కలిగేటట్లు సోషల్ మీడియాలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ అభిమానులు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ని ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సినిమా హీరోగానే మిగిల్చింది సొంత పార్టీ కార్యకర్తలు అభిమానులు అందుకే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సామాన్య జీవితాలను ప్రభావితం చేయలేక పోయారని కామెంట్లు చేస్తున్నారు.