పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపై జనసేన పట్టు వదలకూడదు అంటున్నారు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య. ఈమేరకు ఆయన పవన్ ని మరోసారి టార్గెట్ చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేసారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 11 అసెంబ్లీ,ఒక పార్లమెంట్ సీట్లను ఖచ్చితంగా తీసుకోవాలని లేఖలో జోగయ్య సూచించారు.ఈ సీట్లను జ్ఞాసేన అభ్యర్థులకు కేటాయించకపోతే ఆ తరువాతి పరిణామాలకు తెలుగుదేశం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నా తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య సీట్ల పంచాయతీ తెగడం లేదు.పైగా చంద్రబాబు ను పవన్ కలిసిన ప్రతిసారీ జనసేన సీట్లను తగ్గిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీకి ఎంత వేవ్ ఉన్నప్పటికీ జనసేన సపోర్ట్ లేకుండా టీడీపీ అభ్యర్థులు గెలవరెన్నది వాస్తవం.ఈ విషయం అటు చంద్రబాబుకి కూడా ఎరుకే.కానీ జనసేనకు ప్రాధాన్య సీట్లను కేటాయించడంలో చంద్రబాబు కి ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. పొత్తు ధర్మాన్ని పాటించాలని పవన్ చెబుతున్నా చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారు.దీనిపై పవన్ కూడా పెద్దగా పట్టు పట్టినట్లు లేదనిపిస్తోంది.అందుకే జనసేన కేడర్ కూడా నిరుత్సాహంగా ఉంటున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ సామాజికవర్గం ఓటర్లే ఎక్కువ.అందులో 90 శాతం ఓట్లు ఈ కూటమికే పడాలంటే జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించాలని మాజీ ఎంపీ హరిరమజోగయ్య కోరుతున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గవద్దని పవన్ కి సూచిస్తూ బహిరంగ లేఖ విడుదల చేసారు. నరసాపురం,భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం,నిడదవోలు, ఉంగుటూరు,ఏలూరు,ఉండి, పోలవరం,గోపాలపురం,కొవ్వూరు….ఈ 11 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నరసాపురం పార్లమెంట్ ను కూడా జనసేనకు కేటాయించాలని జోగయ్య కోరుతున్నారు.ఈ విషయంలో పవన్ ఒక మెట్టు దిగినా ఒప్పుకునేదిలేదని తేల్చిచెప్పారు.ఒకవేళ పవన్ ని కాదని టీడీపీకి ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఆ తరువాత జరిగే పరిణామాలకు చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని లేఖలో హెచ్చరించారు.