ప్రకాశం నుంచి జగన్ కి ఊహించని గుడ్ న్యూస్ !

-

ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో చాలా వరకు ప్రతిపక్ష పార్టీ టీడీపీకి పెద్దగా అవకాశం దొరకడం లేదు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి. ఒకపక్క మూడు రాజధానుల నిర్ణయం మరోపక్క సరికొత్త సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టడంతో వైసిపి పార్టీకి మంచి ఆదరణ ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది. Image result for ys  jaganఈ నేపథ్యంలో చాలా వరకు ఇతర పార్టీల నుండి వైసీపీ పార్టీలోకి రావడానికి నాయకులు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే నేను సై అంటే నీ ప్రతిపక్ష పదవి కూడా పోతుందని జగన్ ఆనాడే కామెంట్ చేయటం మనకందరికీ తెలిసినదే. ఇటువంటి తరుణంలో 2014 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున గెలిచిన నాయకులు ఆ సమయంలో చంద్రబాబు ఆఫర్లకు లొంగిపోయి పార్టీ మారడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశం జిల్లాలో 2014 ఎన్నికల్లో పార్టీ మారిన వైసీపీ జంపింగ్ జపాంగ్ అభ్యర్థులు అంతా ఇప్పుడు వైసీపీ పార్టీలోకి రావటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. వీరిలో ముందుగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు ఇంకా కొంతమంది నాయకులు వైసీపీ పార్టీలోకి గుంపుగా రావాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఖచ్చితంగా ఈ నేతలు మళ్లీ పార్టీలోకి వస్తే జగన్ కి ఇది ఊహించని గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. 

Read more RELATED
Recommended to you

Latest news