నన్ను పోలీసులు గిచ్చారు, గల్లా జయదేవ్ ఆవేదన…!

-

తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ని గుంటూరు జిల్లా సబ్ జైలు నుంచి పోలీసులు విడుదల చేసారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. తనను పోలీసులు హింసించారు అంటూ గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేసారు. 149 సెక్షన్ నోటీసు తనకు ఇవ్వలేదని, తన ఇంటికి కూడా నోటీసులు అంటించలేదని చెప్పిన గల్లా అందుకే తాను నిరసన చేసుకునే హక్కు ఉందని ఉందన్నారు.

తాను శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకుని హింసాత్మకంగా ప్రవర్తించారని గల్లా ఆగ్రహం వ్యక్తం చేసారు. తనపై లాఠీ ఛార్జ్ చేస్తే తుళ్లూరు మహిళలు కాపాడారని చెప్పిన ఆయన, తనను పోలీసులు గోళ్ళతో గిచ్చారని, చొక్కా చింపారని, పోలీసులు గిచ్చుతున్నారంటే ఏంటో అనుకున్నా అని ఇప్పుడు తనకు బాగా తెలిసింది అన్నారు. ఒకానొక దశలో ఎస్పీ తనను కొడతారని భయపడ్డానని,

ఎస్పీ చేతిలో లాఠీ ఉందన్నారు. 15 గంటల పాటు తనను నరసరావుపేట, రొంపిచర్ల, కొల్లిపారతో పాటు గుంటూరు మొత్తం తిప్పి పోలీసుస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారని, వైద్య సదుపాయం కావాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని, పోలీసు జీపులోనే వైద్య పరీక్షలు చేసి జైలుకి పంపారని ఆవేదన వ్యక్తం చేసారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే పోలీసులపై ఎవరూ రాళ్లు వేయలేదని, పోలీసులే వాళ్లపై మట్టిపెళ్లలు వేసుకుని కావాలని లాఠీఛార్జ్‌ చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news