సాధారణంగా బౌలర్లు ఎంత స్పీడ్ తో బంతి విసురుతారు. అంతర్జాతీయ క్రికెట్ లో అయితే 150 స్పీడ్ వరకు వేస్తారు. అంతకు మించి ఒకరో ఇద్దరో విసురుతారు. ఎప్పుడో అద్రుష్టం బాగుంటే 160 విసిరే అవకాశం ఉంటుంది. 2003 ప్రపంచక్‌పలో అక్తర్ 161.3 కి.మీతో బంతి విసిరితే ప్రపంచ క్రికెట్ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత షాన్ టైట్ లాంటి స్పీడ్ బౌలర్లు 150 మించి వేసినవి చూసాం.
కాని ఒక బౌలర్ ఏకంగా 175 కిలోమీటర్ల స్పీడ్ తో విసిరిన ఒక బంతి ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ని ఆశ్చర్యపరిచింది. భారత్‌తో జరిగిన అండర్-19 ప్రపంచక్‌పలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరణ యశస్వీ జైస్వాల్ కి విసిరిన బంతి ఏకంగా 175 కి.మీ వేగంతో పడింది. ఈ ఫార్మాట్ లో చూసుకున్నా సరే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అత్యంత స్పీడ్ బాల్ కావడం విశేషం. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అతనికి మంచి కెరీర్ ఉంటుందని కొందరు అంటుంటే, చెప్పిన కబుర్లు చాలు గాని స్పీడ్ గన్ లో తేడా ఉండటం కారణంగా అది అంత నమోదు అయిందని అసలు అంత స్పీడ్ బాల్ పడుతుందా అంటి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు నమోదుకు సంబంధించి ఐసీసీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో ఆ బాల్ అంత స్పీడ్ పడలేదు అంటున్నారు. ఇప్పటి వరకు అక్తర్ పేరు మీద స్పీడ్ బాల్ రికార్డ్ ఉంది.
Sri-Lankan U19 Pacer Pathirana clocked a stunning 175 kph on the speed gun in #U19CWC match Against India on a Wide Ball.
On the right corner of the screen, the speed of the delivery showed at 108 mph. #INDvSL #INDU19vSLU19 #Cricket #CWCU19 pic.twitter.com/7uKD73zYn0
— Mahirat ?? (@GOATKingKohli) January 20, 2020