ఏపీ ప్ర‌భుత్వానికి గీతా ఆర్ట్స్ విరాళం

ప్ర‌స్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా ఇండ‌స్ట్రీ కి రాజ‌కీయ రంగం వాళ్లు కు మ‌ధ్య లాబీయింగ్ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఇప్పటికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమా కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే సినిమా టికెట్ల విష‌యం లో జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణయాన్ని ప‌వ‌న్ కళ్యాణ్ తో పాటు ప‌లువురు వ్య‌తిరేకించారు.

మ‌రి కొంద‌రు ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పై ప్ర‌శంస‌లు కురుపించారు. అయితే తాజా గా గీతా ఆర్ట్స్ అనే సినిమా నిర్మాణ సంస్థ ఆంధ్ర ప్ర‌దేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 10 లక్షల విరాళం ప్రకటించింది. ఈ విష‌యం గీతా ఆర్ట్స్ త‌న అధికార ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఈ నిధి ని రాయ‌ల‌సీమ వ‌ర‌ద భాదితుల కు స‌హాయం చేయాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞాప్తి చేసింది. అయితే సినిమా ఇండస్ట్రీ పై జ‌గ‌న్ స‌ర్కార్ ప‌లు ఆంక్ష‌లు పెడుతున్న సమయం లో గీతా ఆర్ట్స్ విరాళం ప్ర‌క‌టించిడం పై ప‌లువురు ఆలోచిస్తున్నారు.