వివాదాస్పద ఆర్టికల్ 370ని రూపొందించింది ఎవరో తెలుసా?

746

డెభై ఏండ్లకు పైగా దేశంలో అత్యంత వివాదాస్పద ఆర్టికల్‌గా నలుగుతున్న 370 ని రూపొందించింది ఎవరో తెలుసా… మాజీ ప్రధాని నెహ్రూ సమయంలో వివాదాస్పదమైన ఆర్టికల్ 370 ని రూపొందించినది.. తమిళనాడుకు చెందిన గోపాలస్వామి అయ్యంగార్ అప్పట్లో దీనిని రూపొందించారు. ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తంజావూరుకు చెందిన అప్పటి ఐ.ఏ.ఎస్ అధికారి.

gopalaswami ayyangar designed article 370

1905 లో మద్రాసు సివిల్ సర్వీస్ అధికారిగా విధుల్లో చేరి, 1919 వరకు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత వృత్తిరీత్యా వివిధ ప్రదేశాల్లో పని చేశారు. 1937 నుంచి 1943 వరకు జమ్మూకశ్మీర్ ప్రధానిగా నియమింపబడ్డారు. తర్వాత 1943 నుంచి 47 వరకు మంత్రిగా పనిచేశారు. తర్వాత 1947 నుంచి 48 వరకు ఆనాటి ప్రధాని నెహ్రూ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

gopalaswami ayyangar designed article 370

అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి నియమింపబడ్డ ఏడుగురు సభ్యుల బృందంలో ఈయనొకరు. తర్వాత జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రూపొందించారు. అప్పట్లో ఎలాంటి మంత్రిత్వ శాఖ లేకుండానే మంత్రిగా కొనసాగి, జమ్మూకశ్మీర్ వ్యవహారాలను పర్యవేక్షించారు.

– కేశవ