ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (MP Raghurama Kirshnam Raju) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు ఆయన ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసి జగన్ ప్రభుత్వం, సీఐడీపై ఫిర్యాదు చేశారు. తనపై కస్టడీలో జరిగిన దాడి పైనే ఆయన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. వరుసగా రాజ్ నాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి మరీ ఫిర్యాదు అందజేశారు.
ఇక తన తోటిఎంపీలకు కూడా ఆయన లేఖలు రాసి తనపై జరిగిన దాడి గురించి చెప్పడంతో బాగానే కలిసొస్తుంది. పార్టీలకు అతీతంగా చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపారు. ఇప్పుడు మరికొందరు అండగా మాట్లాడుతున్నారు.
తాజాగా తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మాణిక్కం ఠాగూర్ రఘురామపై జరిగిన దాడిని ఖండించారు. ఏపీలో హిట్లర్ పాలన సాగుతోందంటూ మండిపడ్డారు. అలాగే కేరళలోని కొల్లాం ఎంపీ ప్రేమ్‌చంద్రన్ కూడా రఘురామకు అండగా నిలిచారు. ఏపీ పోలీసులు తీరు దారుణమని మండిపడ్డారు. దీనిపై లోక్ సభలో చర్చిస్తామంటూ తెలిపారు. మొత్తంగా రఘురామ ప్లాన్ బాగానే పనిచేస్తోంది.