రేవంత్ డెసిషన్…కేటీఆర్ డిసైడ్…ఈటల డిస్టింక్షన్..

-

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఏ పార్టీ పరిస్తితి ఎలా ఉందో ఇప్పుడుప్పుడే అర్ధమవుతుందని, ఇక్కడ ఏ పార్టీల మధ్య పోటీ ఉంది? ఎవరు గెలుస్తారు? అనే అంశాలపై క్లారిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఏది ఎలా జరిగినా ఇక్కడ పార్టీల మధ్య పోటీ కంటే కేసీఆర్, ఈటల రాజేందర్‌ల మధ్య పోటీ లాగానే హుజూరాబాద్ ప్రజలు చూస్తున్నారని చెబుతున్నారు. అంటే పార్టీల పరంగా చూసుకుంటే టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధానంగా ఫైట్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడి ప్రజలు ఈ ఉపఎన్నికని కేవలం వ్యక్తుల మధ్య ఫైట్ గానే చూస్తున్నారని, అందులో ఎలాంటి అనుమానం లేదని అంటున్నారు.

Huzurabad | హుజురాబాద్

ఈటలపై కావాలనే ఆరోపణలు చేసి కేసీఆర్, మంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బయటకెళ్లెలా చేశారని ఎక్కువ మంది ప్రజలు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆ నమ్మకాన్ని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగానే ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వేల కోట్లతో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఇతర పార్టీల నాయకులని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం, హుజూరాబాద్ నాయకులకు పదవుల పంపకాలు చేయడం చేస్తున్నారు. కేసీఆర్ ఎన్ని చేసినా, ఇదంతా ఈటల రాజీనామా చేయడం వల్లే జరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. అందుకే హుజూరాబాద్‌లో ఈటలకే ఎక్కువ ప్రజా మద్ధతు ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే గ్రహించినట్లు కనబడుతోంది. అందుకే ఈ ఉపఎన్నికని పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ప్రజలకు హుజూరాబాద్‌లో కేసీఆర్‌ని ఓడించాలని చెబుతున్నారు గానీ, కాంగ్రెస్ గెలవాలని చెప్పడం లేదు. అంటే హుజూరాబాద్‌లో కేసీఆర్‌ని ఓడించాలనేది రేవంత్ డెసిషన్.

అటు ఎన్ని చేస్తున్న కూడా హుజూరాబాద్‌లో తమకు అనుకూలమైన వాతావరణం రావడం లేదని మంత్రి కేటీఆర్ సైతం అర్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ ఉపఎన్నిక వల్ల ప్రభుత్వం ఏమి కూలిపోదని అంటున్నారు. అంటే పరోక్షంగా హుజూరాబాద్‌లో ఓటమి వస్తుందని కేటీఆర్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇక ఈ పరిణామాలని చూసుకుంటే చివరికి డిస్టింక్షన్‌లో ఈటల విజయం సాధించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version