ఆ ఒక్క హామీని ప్రకటిస్తే 2024లో సీఎం జగన్ కు తిరుగులేదా?

-

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రజలకు మరింత మేలు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విశాఖకు ఇప్పటికే పెద్దఎత్తున పెట్టుబడులు వస్తుండగా డిసెంబర్ నెల నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన సాగించనున్నారు. ఏపీ రాజధాని ఏదనే విమర్శలు చేసిన వాళ్లకు విశాఖనే ఏపీ రాజధాని అని జగన్ ధీటుగా బదులివ్వనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే 2024 ఎన్నికల్లో విజయం సాధించడానికి జగన్ మరో సంచలన హామీ దిశగా అడుగులు వేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భూములు లేని పేద రైతులకు మేలు చేసేలా అర ఎకరం నుంచి రెండెకరాల వరకు భూములు పంచేలా జగన్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. అధికారికంగా ఈ హామీ అమలు దిశగా ఏ మాత్రం అడుగులు పడినా 2024లో సీఎం జగన్ కు తిరుగులేదని వైసీపీ నేతలు ఫీలవుతున్నారు.

ప్రస్తుతం ఎకరం పొలం విలువ ఏపీలో 10 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. వ్యవసాయం చేయాలనే ఆశ ఉన్నా భూమి లేకపోవడం, భూమిని కొనుగోలు చేసేంత డబ్బులు లేకపోవడంతో చాలామంది వ్యవసాయానికి దూరంగా ఉంటున్నారు. జగన్ సర్కార్ ఈ నిర్ణయం అమలు దిశగా ప్రణాళికలను సిద్ధం చేసినట్టు పొలిటికల్ వర్గాల టాక్.

ఇలాంటి సంచలన హామీని ప్రకటించి అమలు చేసే సత్తా ఇతర పార్టీలకు సైతం లేదు. అవినీతి లేకుండా వైసీపీ పాలన సాగిస్తోంది కాబట్టే జగన్ నవరత్నాలలో భాగంగా ప్రకటించిన హామీలను సైతం సులువుగా అమలు చేయగలిగారు. కంపెనీలు తీసుకొనిరావడం మాత్రమే అభివృద్ధి కాదని రాష్ట్రంలోని ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అని భావిస్తున్న జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగులు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version