ఎవరు ఔనన్నా కాదన్నా కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హవా సాగిస్తుంది మాత్రం వైసీపీ పార్టీనే. జగన్ ఏ ట్రెండ్ సెట్ చేస్తే దాంట్లో నడవడమే ఇప్పుడు గత కొద్ది కాలంగా టీడీపీ పార్టీ చేస్తున్న పని. అయితే ఇప్పటి వరకు టీడీపీ మాత్రమే తనకు ప్రతిపక్షమని అనుకుంటున్న జగన్కు తాము కూడా ఉన్నామంటూ బీజేపీ, జనసేన రాజకీయాలు చేస్తున్నాయి. దీంతో జగన్ కూడా ఆ రెండు పార్టీలను ఎదుర్కునేందుక మంచి ప్లానే వేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో అవి కూడా బలపడితే అప్పుడు జగన్కు త్రిముఖ ఇబ్బంది అవుతుంది.
ఇక గత కొద్దికాలంగా కేంద్రం కూడా జమిలిఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అలర్ట్ అయి తన పార్టీ నేతలకు సూచనలు చేస్తూనే ఉన్నారు. తమ పార్టీ ఓడిపోయిన స్థానాలపై ఫోకస్ పెట్టినా కూడా అది పెద్దగా ఫలించట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆ స్థానాల్లో ప్రయత్నాలు పెద్దగా జనాల్లోకి వెల్లకపోవడంతో అవి ఫెయిల్ అవుతున్నాయి.
అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వమే వచ్చే ఎన్నికల్లో పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ ప్లాన్ వేస్తున్నారంట. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రజల్లో ఇప్పుడు ఉన్న ఆదరణను అవకాశంగా మలుచుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అన్ని రాష్ట్రాలతో ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం అది మైనస్ అవుతుందని ఆలోచిస్తున్నారంట. నిజంగా అలాగే జరిగితే టీడీపీ ఇప్పటికిప్పుడు ఓడిపోయిన స్థానాల్లో గెలవడం కాదు కదా గెలిచిన స్థానాల్లో కూడా తిరిగి గెలుస్తుందా అని అంటున్నారు విశ్లేషకులు.