ఇండియా కూటమిలో మమత ప్రకంపనలు.. మిత్రపక్షాల వాయిస్ ఏంటంటే..?

-

ఇండియా కూటమికి నాయకత్వ లేమి వెంటాడుతోందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.. ఈ క్రమంలో మమతా బెనర్జీకి అవకాశం ఇవ్వాలంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు.. ఈ క్రమంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిలో దుమారం రేపుతున్నాయి.. ఆమె వ్యాఖ్యలను కొన్ని పార్టీలు స్వాగతించగా.. కాంగ్రెస్ నుంచి మాత్రం కౌంటర్లు వస్తున్నాయి..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఇండియా కూటమిలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాయి.. భాగస్వామ్య పక్షాల నుంచి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయి నేతగా మమతా బెనర్జీ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ప్రశ్నించగా…ఎస్పీ, శివసేన ఉద్ధవ్ వర్గాలు సమర్దిస్తున్నాయి.. దీంతో ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది..

ఇటీవల జరిగిన పలు రాష్టాల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఇండియా కూటమికి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.. ఎన్డీఏ కూటమిని ఎదుర్కోలేక చతికిలపడింది.. దీనికి కాంగ్రెస్ నాయకత్వమే కారణమంటూ మిత్రపక్షాలు సైతం పెదవి విరిచాయి.. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం దీదీకి ఇండియా కూటమి పగ్గాలు అప్పగించాలంటూ ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు.. దీనికి ఆమె సైతం తాను సిద్దంగానే ఉన్నట్లు ప్రకటించడం ఇప్పుడు ఇండియా కూటమిలో దుమారం రేపుతోంది..

బిజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని తాను ఏర్పాటు చేశానని.. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీదీ చెప్పారు.. కాంగ్రెస్ మాత్రం సరైన ప్రదర్శన ఇవ్వడంలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. జాతీయస్థాయిలో ఆమె సమర్దతపై కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.. అయితే ఆమెకు మద్దతుగా శివసేనలోని ఉద్దవ్ వర్గం, సమాజ్ వాదీ పార్టీ తమ అభిప్రాయాలను తెలియజేశాయి.. కూటమిలో మితప్రపక్షాలకు సరైన ప్రాదాన్యత కూడా లేదన్న టాక్ ఆయా పార్టీల నుంచి వస్తోంది.. ఈ క్రమంలో ఇండియా కూటమిలో చీలికలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news