తెలంగాణ ఎప్పుడు ఎన్నికలు జరిగిన వంద సీట్లతో BRS గెలుపు పక్కా అని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపుతాం. సెక్రటేరియట్ లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపడం పక్కా అని అన్నారు. తెలంగాణలో సాంస్కృతిక విప్లవం రావాలి. నేడు జరిగిన అపచారానికి ప్రజలు ఏకం కావాలి. ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి ఫోటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుందాం అని పిలుపునిచ్చారు.
అలాగే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేద్దాము. రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారు. ఘట్ కేసర్ రైతు కోఆపరేటివ్ సోసైటిలో 1190 మంది రైతులు ఉంటే ఒక్కరికి రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి అదానీ కోసం అల్లుని కోసం,అన్నదమ్ముళ్ల కోసం,బామ్మర్ధికి అమృత్ కోసం పని చేస్తున్నారు. వచ్చే సంవత్సరం అనుముల బ్రదర్స్ అదానీ ఆస్తులను మించిపోతారు అని కేటీఆర్ తెలిపారు.