కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణపై దాడి చేస్తున్నారు : KTR

-

దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కేసీఆర్ తన దీక్షతో తెలంగాణ ప్రకటనకు శ్రీకారం చుట్టారు అని BRS వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని గుర్తిస్తారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణపై దాడి చేస్తున్నారు. కేసీఆర్ ను చిన్నగ చేసి చూపెట్టె ప్రయత్నంలో అస్తిత్వం మీద దాడి జరుగుతోంది.

ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయం అయింది. తెలంగాణ తల్లిలో బతుకమ్మ మాయం అయింది. సెక్రటేరియట్ లో లంకె బిందెలు లేవని రేవంత్ రెడ్డికి అర్ధం అయింది. తెలంగాణ ఇస్తే మీకు పరిపాలన రాదని అన్నారు. పదేళ్ళలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. యాసను వెక్కిరించారు ఇందిరాగాంధీ భారతమాతను హరిద్వార్ లో ఏర్పాటు చేశారు. సమైక్య పాలకులు పగబడితే 2007 లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. హంతకులే సంతాపం తెలిపినట్లు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న వాళ్ళు తెలంగాణ తల్లి బీదగా ఉండాలని రూపాన్ని మార్చారు. ప్రపంచంలో ఆలిని మార్చిన వాళ్ళు ఉన్నారు.. కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ఎవరూ లేరు అని KTR పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news