ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాల్లో కొన్నాళ్లుగా చక్రం తిప్పుతున్న ఎడం బాలాజీ.. పరిస్థితి నాలుగు అడు గులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్నచందంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. జరుగు తున్న పరిణామాలను గమనిస్తే.. ఆయనకు రాజకీయాలు పెద్దగా కలిసి రాలేదని అనేవారు కూడా ఉండ డం గమ నార్హం. విషయంలోకి వెళ్తే.. 2014లో వైసీపీ తరఫున చీరాల నుంచి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయారు. పైగా టీడీపీ నుంచి పోతుల సునీత.. స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి కృష్ణమో హన్ వంటి వారు తలపడడంతో ఎడం బాలాజీది ఒంటరి పోరుగా మారిపోయింది.
ఎన్నారై కావడంతో నిధులు తెచ్చి ఏదో హడావుడి చేసినా.. పెద్దగా కలిసిరాలేదు. అయినా పార్టీలోనే ఉ న్నారు. వైసీపీ తరఫున బాగానే పనిచేసినా.. కార్యకర్తలను సమీకరించలేక పోయారు. ఇక, 2019 విషయానికి వస్తే.. ఆ ఎన్నికల సమయానికి ఆమంచి వైసీపీలోకి రావడంతో ఎడం బాలాజీని జగన్ పక్కన పెట్టారు. దీంతో ఆ యన కొన్ని విమర్శలు చేసి, తర్వాత టీడీపీలోకి వెళ్లారు. బాబు అనుగ్రహించినా.. ఆ ఎన్నికల్లో టికెట్ మా త్రం ఇవ్వలేదు. కరణం బలరాంకే చంద్రబాబు టికెట్ ఇచ్చారు.
ఇదిలావుంటే, ఇప్పుడు బాలా జీ.. చీరాల టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. దీంతో పార్టీపై నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ప్రయ త్నిస్తున్నారు. అయితే, పార్టీలో సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే కరణం బలరాం సహా ఆయన కుమారుడు వెంకటేష్‌లు పార్టీకి గుడ్ బై చెప్పారు. వెంటనే వెళ్లి అధికార వైసీపీలో చేరిపోయారు. వీరితో పాటు సహజంగానే కార్యకర్తలు కూడా వైసీపీ బాట పట్టారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఎడం బాలాజీ టీడీపీలో ఒంటరిగా మారిపోయారు.
నియోజకవర్గం మొత్తంలోనూ కీలకమైన నాయకులు లేకపోవడం, తాను పార్టీకి కొత్త కావడంతో ఎవరినీ కలుపుకొని పోలేక టీడీపీలో ఒంటరి పోరు సాగుస్తున్నారు ఎడం బాలాజీ. ఈ క్రమంలోనే ఆయన అనుచరులు కూడా మావోడికి రాజకీయాలు కలిసిరాలేదు గురూ! అని అనేస్తున్నారు. మరి బాలాజీ వీటిని లైట్‌గా తీసుకుంటున్నారు. అలా లైట్‌గా తీసుకోకపోతే.. ఇబ్బందే మరి!