కూర్చుంటే తప్పు.. నించుంటే తప్పు.. అన్నట్టుగా ఉంది టీడీపీ రాజకీయం. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని టార్గె ట్ చేసుకున్న టీడీపీ తమ్ముళ్లు ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారు. ఆయన కరోనా కేసులు తగ్గించి చూపుతున్నారని అన్నారు. విశాఖలో తగ్గించి చూపుతున్నారని, గుంటూరులో అయితే, ఎక్కువగా చూపుతు న్నారని నిన్న మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు పేదలకు పం చే మాస్కుల విషయంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ మూడు మాస్కు లు పంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అయితే, దీనిని కూడా టీడీపీ నాయకులు తప్పు పడుతున్నారు. మాస్కులు పంచితే కరోనా తగ్గిపోతుందా? అని దేవినేని ఉమా వంటి వారు ఆరోపిస్తున్నారు. మరోపక్క, పేదలకు మాస్కులు పంచితే తప్పులేదు కానీ.. అందరికీ ఎందుకని కొందరు దీర్ఘాలు తీస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించ డాన్ని కూడా నాయకులు తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నారు. నిజానికి కాంట్రాక్టర్లకు ఇప్పుడు బకాయిలు చెల్లింపు వెనుక జగన్ వ్యూహం ఉంది. పని చేసిన కూలీలకు కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించ లేదు. దీంతో పేదలకు ఇప్పుడు కరోనా సమయంలో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది.
ఈ క్రమంలో పేదలను దృష్టిలో పెట్టుకునే జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చింది. దీనిని కూ డా టీడీపీ తన రాజకీయాలకు అనుకూలంగా మార్చుకుంది. ఇక, కరోనా కేసుల విషయానికి వస్తే.. బాబు అనుకూల పత్రికలోనే వచ్చినట్టు.. విశాఖలో ఎందుకు తక్కువ నమోదయ్యాయో స్పష్టమైంది. అక్కడ వ్యాప్తి తక్కువగా ఉంది. దీనికి కారణం ఢిల్లీలో జరిగిన మర్కజ్‌కు ఇక్కడ నుంచి హాజరైనవారి సంఖ్య తక్కువగా ఉంది. అదేసమయంలో గుంటూరులోను, కర్నూలులోనూ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే పరిస్థితి దిగజారింది. అయినా.. గర్భాన్ని.. రోగాన్నిఎలా దాచడం సాధ్యమో.. చంద్రబాబు అండ్ టీం చెప్పాలని అంటున్నారు వైసీపీ నాయకులు. ఏమీ లేనప్పుడు.. ఏదో ఒక రాజకీయం చేయాలనే దుగ్ధ తప్ప మరేమీ లేదని అంటున్నారు.