షర్మిలకు మొండి ‘హస్తం’..సీటు గల్లంతు.!

-

వైయస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టిపిని స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ రాజన్న రాజ్యం తేవడానికి, సమస్యలపై పోరాటం చేయడానికి తాను ఈ పార్టీని స్థాపించినట్లు షర్మిల చెబుతూ ఉండేవారు. ఆ సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్షలు  పాదయాత్ర కూడా చేశారు. గత కొన్ని రోజులుగా వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆలోచనతో షర్మిల ఉన్నట్లు ఆ విషయమై అధిష్టానం పెద్దలతో చర్చలు జరిగిన సంగతి తెలోయిసిందే. కానీ చర్చల్లో షర్మిల ఆశించిన ఫలితాలు దక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు షర్మిలకు మధ్య చర్చలలో కీలక పాత్ర పోషించిన కేసి గోపాల్ చర్చలు పూర్తయ్యాయని ఇంక నిర్ణయం షర్మిలదే అని అని తెలిపారు. కానీ షర్మిల కోరుకున్న ఎమ్మెల్యే స్థానాన్ని గాని, ఎంపీ స్థానాన్ని గాని ఇవ్వడానికి కాంగ్రెస్ పెద్దలు సుముఖంగా లేరనీ వార్తలు వినిపిస్తున్నాయి.

పాలేరు సీటును షర్మిల ఆశిస్తే ఆ స్థానాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఖమ్మం ఇస్తారు అని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆ స్థానాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సిపిఐ తో పొత్తు ఉన్న నేపథ్యంలో కొత్తగూడెంపై ఆశలు వదులుకోవాల్సిందే. ఎంపీ స్థానాన్ని అయినా ఇస్తారేమో అంటే అధిష్టానం మౌనమే సమాధానం ఇస్తుంది . మరి ఇలాంటి సమయంలో తెలంగాణ రాజకీయాలలో షర్మిల పాత్ర ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. షర్మిల ఎటువైపు అడుగుల వేస్తారా అనేది ఆసక్తికరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version