ఆపరేషన్ గరుడలో భాగంగానే జగన్ పై దాడి జరిగిందా?

-

ఆపరేషన్ గరుడ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అంటారా? అవును.. విన్నారు కానీ.. మరిచిపోయి ఉంటారు. ఎందుకంటే… ఓ ఐదారు నెలల కింద ఆపరేషన్ గరుడ గురించి ఓ వీడియోను చేశాడు హీరో శివాజీ. గుర్తొచ్చిందా.. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటది కదా. అప్పుడు ఏమి చెప్పాడు శివాజీ… బీజేపీ ప్రభుత్వం ఏపీలో ఆపరేషన్ గరుడను అమలు చేయబోతున్నదని అన్నాడు. దేనికి అంటే.. ఏపీలో టీడీపీని రాజకీయంగా దెబ్బతీయడానికి అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన మాటలను ఎవ్వరూ నమ్మలేదు. అంత నమ్మబుల్ గా ఆయన మాటలు లేకునే సరికి అంతా లైట్ తీసుకున్నారు అప్పుడు.

కానీ.. కట్ చేస్తే.. ఇవాళ వైఎస్ జగన్ పై దాడి జరిగింది. ఏపీలో ఐటీ దాడులు మొదలయ్యాయి. అసలు ఆయన అపరేషన్ గరుడ గురించి ఏం చెప్పాడు అంటే.. జాతీయ పార్టీ ఏపీలో అలజడులు సృష్టించడానికి ఆపరేషన్ గరుడను ప్రారంభించింది. ఏపీకి చెందిన ఓ ముఖ్య పార్టీ నాయకుడికి ప్రాణహాని లేకుండా దాడి జరుగుతుంది అని చెప్పాడు. అలా చేయడం వల్ల ఏపీలో అలజడులు చెలరేగుతాయి అని అన్నారు. దాన్నంతా ఓ ప్లాన్ లా గీసి మరీ వివరించాడు. ఇప్పుడు ఆ ముఖ్యమైన నాయకుడు జగనేనా? శివాజీ చెప్పినట్టే జరుగుతున్నదా? అయినా.. బీజేపీతో సఖ్యతగా ఉండే జగన్ ను ఎందుకు కేంద్రం టార్గెట్ చేస్తుంది. అయితే గియితే టీడీపీని టార్గెట్ చేయాలి.. కానీ.. అంటూ నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి.. ఈ ఐటీ దాడుల సంగతేంది. అసలు బీజేపీ టార్గెట్ ఏంటి. టీడీపీపై అస్త్రం ప్రయోగించడమా? అలా అయితే.. జగన్ పై అటాక్ చేసింది ఎవరు? జగన్ పై అటాక్ చేసేంత కోపం ఎవరికి ఉన్నది? ఇలా… రకరకాల ప్రశ్నలతో నెటిజన్లే కాదు.. తెలుగు రాష్ట్రాల జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు.

సరే.. అవన్నీ వదిలేయండి.. ఇంతకీ.. ఆ శివాజీ ఆపరేషన్ గరుడ గురించి ఇంకా ఏం చెప్పాడో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version