రుణమాఫీతో కేసీఆర్‌కు చిక్కులు..తప్పించుకుంటారా?

-

రాజకీయాల్లో నేతలు ఇచ్చిన మాట తప్పడం సహజంగానే జరిగే ప్రక్రియ. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇస్తారు. అయితే ఆ హామీలని నమ్మి ప్రజలకు వారికి ఓటు వేస్తారు. ఇక గెలిచి అధికారంలోకి వచ్చిన వారు పూర్తిగా ఆ హామీలని అమలు చేయడం జరిగే పని కాదు. కొన్ని హామీలని కండిషన్స్ అప్ప్లై అన్నట్లు అమలు చేస్తారు. మరికొన్నిటిని పట్టించుకోరు.

అయితే ఒకప్పుడు అలా హామీలని విస్మరించిన ప్రజలు పెద్దగా పట్టించుకునే వారు, గుర్తు పెట్టుకునేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. రాజకీయాల్లో మీడియా హవా పెరిగింది. దీంతో ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు గుర్తు ఉంటుంది. గుర్తు లేకపోతే పాత వీడియోలని బయటపెడతారు. అలా జరిగితే పార్టీలకు నష్టం జరుగుతుంది. ఏపీలో గత టి‌డి‌పి హయాంలో చంద్రబాబు అనేక హామీలని విస్మరించారు.  దీని వల్ల ఆ పార్టీకి నష్టం జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ హామీలని దాదాపు అమలు చేశారు..కానీ మద్యపాన నిషేధం లాంటి హామీల్లో విఫలమయ్యారు. అయినా సరే ప్రతిపక్షాలు వదలడంలేదు. ప్రజలు మరిచిపోలేదు.

ఇప్పుడు తెలంగాణలో అధికారంలో కే‌సి‌ఆర్‌కు అదే చిక్కు వచ్చింది. 2018 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. అందులో చాలా వరకు అమలు చేశారు..కానీ కొన్ని విస్మరించారు. వాటిల్లో మొదటిది రైతు రుణమాఫీ..ఎన్నికల సమయంలో లక్ష లోపు రుణాలని మాఫీ చేస్తానని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక..50 వేల లోపు రుణాలని మాఫీ చేశారని..కానీ లక్ష మాఫీని వదిలేశారు.

లక్ష లోపు రుణాలు ఉన్న రైతులు దాదాపు 91,991 మంది ఉంటే..కే‌సి‌ఆర్ సర్కార్ కేవలం 50 వేల లోపు రుణాలని మాఫీ చేశారట. అంటే 12,696 మందికే లబ్ది చేకూరింది. ఇక ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయమే ఉంది. ఈ లోపు మిగతా మాఫీ చేస్తే పర్లేదు. అంటే మాఫీ కానీ రైతులు బి‌ఆర్‌ఎస్‌కు యాంటీ అయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మిగతా రుణమాఫీ కూడా చేసి కే‌సి‌ఆర్ మాట నిలబెట్టుకుంటారేమో.

Read more RELATED
Recommended to you

Latest news