జగన్ ఢిల్లీ పర్యటన పొడిగింపు…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అనూహ్యంగా పొడిగించారు. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను జగన్ కలిసారు. తొలుత బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఆయన ఆ తర్వాత మళ్ళీ అమరావతి వచ్చి శుక్రవారం ఢిల్లీ వెళ్ళారు. సాయంత్రం 9 గంటల తర్వాత హోం మంత్రి అమిత్ షా ని కలిసిన ఆయన పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.

దీనితో ఆయన శనివారం ఉదయం ఢిల్లీ నుంచి వస్తారని భావించారు అందరూ. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో కేంద్ర మంత్రులను కలవడానికి అపాయింట్మెంట్ దొరికింది. దీనితో 12 గంటలకు కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని జగన్ కలిసే అవకాశం ఉంది. రాజకీయంగా ఇప్పుడు ఈ పర్యటన కాస్త టీడీపీకి ఆందోళన కలిగిస్తుంది. జగన్ ఎందుకు ఉన్నపళంగా ఢిల్లీ వెళ్ళారు అనేది వారికి అర్ధం కావడం లేదు.

ఇక ఇప్పుడు ఇదిలా ఉంటే జగన్ తాజాగా అమిత్ షా ని కలిసిన వెంటనే హైకోర్ట్ తరలింపు విషయంలో ఆయనతో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి అమిత్ షా అంగీకారం తెలిపారని, దానికి న్యాయశాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉందని అందుకే జగన్ రవిశంకర్ ప్రసాద్ ని కలిసే అవకాశం ఉందని సమాచారం. ఆయనతో పాటుగా మరికొందరు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news