జ‌గ‌న్ నాకు శ‌త్రువు కాదు: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

-

అమ‌రావ‌తి: వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తనకు శత్రువు కాదని, తనకు రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులేకానీ, శ‌త్రువులెవరూ లేరని జ‌నసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వాటిని పట్టించుకోనని అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ పంచాయితీరాజ్‌ వ్యవస్థను పాలకులు నిర్వీర్యం చేశారని విమర్శించారు. తాను కులాన్ని, వర్గాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. తాను పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఎన్టీఆర్‌లా ఉప్పెన లేదని, తన సోదరుడు చిరంజీవిలా ప్రవాహంలేదని.. ఎదురీదుతూ పార్టీ పెట్టానని పవన్‌ వెల్లడించారు. రాష్ట్రంలో బలమైన, సుపరిపాలన కోసమే ఆనాడు టీడీపీకి మద్దతిచ్చానని స్పష్టం చేశారు. పోల‌వ‌రం నిర్వాసితుల‌తో, ఆదివాసి ఉపాధ్యాయులు- గిరిజ‌న విద్యార్థుల‌తో ప‌వ‌న్ స‌మావేశ‌మ‌య్యారు.

సీఎం కార్యాలయంపై ఐటీ దాడులు జరిగితే అప్పుడు ఖండించాలి కానీ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఐటీ దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పై దాడులు చేస్తున్నారు అనడం హాస్యాస్పదమన్నారు.

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు హైదరాబాదులో నివాసం ఉంటానికి హోటల్ బిల్లు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలా అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి మార్పు రావాలని నేను పోరాటం చేస్తున్నానని, మంచి పరిపాలన అందిస్తారని 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని సమర్దించా.. కానీ ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేదు కాబట్టే విభేదిస్తున్నానాని పవన్ చెప్పారు. గిరిజన కుటుంబాల అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version