నేను ఊ.. అంటే చాలు టీడీపీ మొత్తం ఖాళీ అవుతుంది: జగన్

-

నేను ఏ స్థాయిలో విలువలు పాటించానో ప్రజలందరికీ తెలుసు. టీడీపీ ప్రభుత్వమే చట్టాలకు తూట్లు పొడిచింది. సంతలో పశువుల్ని కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు. ఆ ఎమ్మెల్యేలను కాపాడుతూ స్పీకర్.. తన పదవికే కళంకం తెచ్చారు.. అంటూ జ‌గ‌న్ ఫైర్ అయ్యారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక, స్పీకర్‌కు ధన్యవాద తీర్మాణంపై సభ్యులంతా మాట్లాడారు. ఈసందర్భంగా ఫిరాయింపులపై జరిగిన చర్చ అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధాన్ని సృష్టించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇద్దరూ ఒకరిపై మరొకరు రెచ్చిపోయారు.

వైఎస్ జగన్‌ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పుని ఒప్పుకోండి.. మీరు తండ్రికి తగ్గ కొడుకు అని మీరే ఒప్పుకున్నారుగా.. చరిత్రను ఎవ్వరూ మార్చలేరు.. అంటూ చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అవడంతో.. చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

నేను ఏ స్థాయిలో విలువలు పాటించానో ప్రజలందరికీ తెలుసు. టీడీపీ ప్రభుత్వమే చట్టాలకు తూట్లు పొడిచింది. సంతలో పశువుల్ని కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు. ఆ ఎమ్మెల్యేలను కాపాడుతూ స్పీకర్.. తన పదవికే కళంకం తెచ్చారు. చేసిన తప్పును మళ్లీ సమర్థించుకున్నారు. నేను ప్రలోభాలు పెట్టి ఉంటే.. మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటే.. టీడీపీ నుంచి నాతో ఎంతోమంది టచ్‌లో ఉన్నారో చెబితే మీరు తట్టుకోలేరు. నేను ఊ.. అంటే చాలు.. గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. టీడీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది. కానీ.. ఇటువంటి అన్యాయమైన సంప్రదాయాన్ని కొనసాగించకూడదు. టీడీపీ చేసిన తప్పును మేం చేయదల్చుకోలేదు. చట్టసభలో ప్రతిపక్షం ఉండాలి. ఎమ్మెల్యేలు కొనసాగాలి. చంద్రబాబును ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి రావడం.. పాత పరిస్థితి మారాలనుకోవడం.. కొత్త సంప్రదాయం రావాలని చెప్పడం.. ఇవన్నీ మంచి చెప్పే దిశగా వేసే అడుగులు.. అని జగన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version