తన పొత్తులో భాగంగా సీపీఐకి టికెట్ ను కేటాయించింది. అయితే.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. సీపీఐకి ఇచ్చిన సీటును వెనక్కి తీసుకున్నారట.
ఏపీ రాజకీయాల్లో భలే మలుపులు తిరుగుతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠ అన్నట్టుగా… ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నారు ఏపీ ప్రజలు. అయితే.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల కంటే.. ఒకే ఒక్క నియోజకవర్గంపై అందరి చూపు పడింది. అదే మంగళగిరి నియోజకవర్గం. ఎందుకంటే.. ఆ నియోజకవర్గం నుంచి లోకేశ్ బాబు పోటీ చేయడమే. అయ్యో… ఆయనేదో పెద్ద తోపని అనుకునేరు. ఆయన చేసే చిన్నపిల్లల చేష్టలతో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతాడు.
మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. అటూ ఇటూ కాని పార్టీ జనసేన కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపుతుందని అంతా భావించారు. కానీ… తన పొత్తులో భాగంగా సీపీఐకి టికెట్ ను కేటాయించింది. అయితే.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. సీపీఐకి ఇచ్చిన సీటును వెనక్కి తీసుకున్నారట. జనసేన నుంచే అభ్యర్థిని బరిలోకి దించాలని అనుకున్నారట. అందుకే.. నామినేషన్ల చివరి రోజు జనసేన అభ్యర్థిని ప్రకటించింది.
పవన్ చల్లపల్లి శ్రీనివాస్ ను జనసేన అభ్యర్థిగా మంగళగిరి నుంచి ప్రకటించారు. ఆయన ఇవాళ నామినేషన్ కూడా వేశారు. నిన్న రాత్రే చల్లపల్లికి పవన్ బీఫాం అందజేశారట. అయితే… పవన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. అన్న ఆలోచనలో పడ్డారు ఏపీ ప్రజలు.
చంద్రబాబు, పవన్ ఒక్కటేనని.. పవన్ కు ఓటేసినా.. అది చంద్రబాబుకే పోతుందని.. చంద్రబాబు దగ్గర పవన్ అమ్ముడు పోయాడని బయట వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. అందుకే మంగళగిరి నుంచి నారా లోకేశ్ కు పోటీగా జనసేన అభ్యర్థిని ప్రకటించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ ఆ ఆరోపణలకు చెక్ పెట్టడానికి పవన్ అలా చేశారా లేక.. ఇది కూడా చంద్రబాబు వ్యూహంలో భాగమా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.