తెలుగు సరిగ్గా రాదు కదా వదిలేయండి బాబయ్యా.. సరే.. సరే.. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే… నారా లోకేశ్ కు పోటీగా తమన్నా పోటీ చేస్తోంది.
ఈరోజుతో ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. రేపటి నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. సరే.. ఆ నామినేషన్ల గోల మనకెందుకు కానీ.. ఏపీలో రాజకీయాలన్నీ ఇప్పుడు మంగళగిరి చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ పోటీ చేసేది ఎవరనుకున్నారు టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్. ఆయనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఆయనకెందుకు ఆంత ఫాలోయింగ్ అంటారా?
ఆయనంతే అదోటైపు. ఆయనకు సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేనా… ఆయన మైకు పట్టుకొని మాట్లాడితే చాలు.. జనాలంతా నవ్వి నవ్వి చస్తారు. ఆయన మాటలు అలాగే ఉంటాయి మరి. తెలుగు సరిగ్గా రాదు కదా వదిలేయండి బాబయ్యా.. సరే.. సరే.. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే… నారా లోకేశ్ కు పోటీగా తమన్నా పోటీ చేస్తోంది.
అది అసలు మ్యాటర్. ఓహో.. హీరోయిన్లు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారా? ఇంతకీ ఏ పార్టీ నుంచి తమన్నా పోటీ చేస్తోంది.. అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగకండి. ఎందుకంటే.. పోటీ చేసేది తమన్నానే కానీ.. మీరనుకున్న తమన్నా కాదు.
ఆమె పేరు తమన్నా సింహాద్రి. ఆమె హిజ్రా. ఆమె ట్రాన్స్ జెండర్స్ అసోషియేషన్ ప్రతినిధి. మంగళగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనుంది. అది సంగతి.
అయితే.. ట్రాన్స్ జెండర్స్ ఎన్నికలకు నామినేషన్ వేయడం ఇదే తొలిసారి మాత్రం కాదు. ఇదివరకు చంద్రముఖి అనే ఓ ట్రాన్స్ జెండర్… బహుజన లెఫ్ట్ డెమొక్రాటిక్ పార్టీ తరుపున గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది.