99 శాతం మంది రెడ్డి సామాజికవర్గం వాళ్లు వైఎస్సార్సీపీకే ఓటేశారని ఆయన తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
ఏపీలో ఎన్నికలయితే ముగిశాయి కానీ.. ఎన్నికల వేడి మాత్రం తగ్గలేదు. ఇంకాస్త పెరిగిందనే చెప్పుకోవాలి. ఎన్నికలు ముగియడమే ఆలస్యం.. ఏ పార్టీ గెలుస్తుంది… ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అంటూ లెక్కలు వేసుకోవడంలో బిజీ అయిపోయారు రాజకీయ నాయకులు.
అయితే.. తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్న రెడ్డిలంతా వైఎస్సార్సీపీకే ఓటేశారట. అవును.. ఈ మాటలు ఆయనే స్వయంగా చెప్పారు. 99 శాతం మంది రెడ్డి సామాజికవర్గం వాళ్లు వైఎస్సార్సీపీకే ఓటేశారని ఆయన తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
అయితే.. ఈసారి ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడదని.. మళ్లీ టీడీపీయే గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికలన్నీ కులం పేరు మీదే జరిగాయని స్పష్టం చేశారు. ఒకవేళ ఈసారి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే… అది కేవలం పసుపు కుంకుమ చలువేనని జేసీ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ పథకమూ ప్రజలను ఆకర్షించలేకపోయిందని.. ఎన్నికల చివర్లో ప్రవేశపెట్టిన పసుపు కుంకుమే టీడీపీని ఆదుకోబోతుందని ఆయన స్పష్టం చేశారు.