జనసేనకు త్వరలోనే గుడ్ బై చెప్పనున్న జేడీ లక్ష్మీనారాయణ.. బీజేపీలో చేరిక ఖాయమేనట?

526

పార్టీ ఘోర ఓటమితో జనసేన నుంచి చాలామంది నేతలు ఇతర పార్టీలకు జంప్ అయ్యారు. తాజాగా జనసేన కీలక నేత, మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా జనసేనకు గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలిసింది.

ఏ ముహూర్తాన జనసేన పార్టీని పెట్టారో కానీ… జనసేనకు ఆది నుంచి అడ్డకుంలే ఎదురవుతున్నాయి. షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పవన్ కల్యాణ్.. 2019 ఎన్నికల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్దండులను కూడా పార్టీలోకి తీసుకున్నారు. కానీ.. ఆయన్ను దురదృష్టం ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నది.

పార్టీ ఘోర ఓటమితో జనసేన నుంచి చాలామంది నేతలు ఇతర పార్టీలకు జంప్ అయ్యారు. తాజాగా జనసేన కీలక నేత, మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా జనసేనకు గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలిసింది. ఇదివరకే ఆయన పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆయన త్వరలోనే జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారట. బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానం అందిందట. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన అనుచరుడు గంపల గిరిధర్ కూడా జనసేనను వీడనున్నాడట.

ప్రస్తుతం జనసేన ఏ పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. జనసేనకు భవిష్యత్తు లేదనే వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

2019 సాధారణ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి జేడీ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అనుచరుడు గంపల గిరిధర్ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.