ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో ఎవరు రాజకీయాలు చేయకూడదని ప్రకటించడం జరిగింది. ఇలాంటి సమస్య ప్రపంచం ఎన్నడూ ఎదుర్కోలేదు అంటూ కన్నా స్టార్టింగ్ లో మాట్లాడారు. మరి మధ్యలో ఏమైందో ఏమో తెలియదు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాపిడ్ టెస్టింగ్ కిట్స్ విషయంలో అవినీతికి తెగబడింది అంటూ ఆరోపణలు చేశారు. 730 రూపాయలు అని చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేయడం జరిగింది అంటూ విమర్శించాడం మనకందరికీ తెలిసిందే. ఈ విషయం నడుస్తూ ఉండగానే కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి… 20 కోట్లకు చంద్రబాబుకి కన్నా అమ్ముడుపోయారని కౌంటర్లు వెయ్యడం విషయం ఏపీలో హైలెట్ అవ్వటం అందరికీ తెలిసిన విషయమే.అయితే ఆ తర్వాత బిజెపి అధిష్టానం ఈ విషయం లో ఎంటర్ అయ్యి కన్నా పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఇటీవల ఏపీ బిజెపి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా విజయ్ సాయి రెడ్డి వ్యవహారం విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా కన్నా లక్ష్మీనారాయణ చేయడం పై సీరియస్ అయ్యాడట. ఇతర రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రభుత్వాలు రాపిడ్ టెస్టింగ్ కిట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కంటే అధిక ధరకు కొనుగోలు చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా హై కమాండ్ పర్మిషన్ తీసుకోకుండా విమర్శలు చేయటం ఏంటి అని కన్నా పై మండిపడ్డారు.
పరిస్థితి ఇలా ఉండగా ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని చూసిన వేస్ట్ అని కన్నా లక్ష్మీనారాయణ తాజాగా డిసైడ్ అయ్యారట. కేంద్రంలో ఉన్న బిజెపి మరియు రాష్ట్రంలో ఉన్న వైసిపి మధ్య విజయసాయి రెడ్డి వ్యవహారం నడిపిస్తున్నాడని కన్నా లక్ష్మీనారాయణ బలంగా నమ్ముతున్నాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితిలో ఏపీ బీజేపీ బలోపేతం అవ్వటం ఎవరి వల్ల కాదని కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ అయిపోయినట్లు సమాచారం.