కర్నూలు: జనసేనకు జనబలం లేదని, కేవలం సినీ గ్లామర్‌తో పవన్ రెచ్చకొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని కత్తి మహేష్ అన్నారు. పవన్‌ను చూడడానికి మాత్రమే జనం వస్తున్నారని, ఆయనకు ఓటు వేయడానికి కాదని అన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా ఆయన గెలిచే అవకాశాలు లేవని అన్నారు. ఆయన ఏ ప్రాంతానికి వెళితే, ఆ ప్రాంతంలో పోటీ చేస్తానని అంటున్నారని, ఇటీవల పాయకారావుపేటకు వెళ్లి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. అది రిజర్వ్‌డ్ నియోజకవర్గమని, అక్కడ ఎలా పోటీ చేస్తాడో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించినప్పుడు ‘మీకు నేనున్నాను’ అని చెప్పిన పవన్ అక్కడ తితలీ తుఫాన్ బీభత్సం సృష్టించినా ఇంత వరకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పవన్‌కళ్యాన్ను బిజేపీ పొషిస్తోంది : కత్తి మహేష్
-