నిజామాబాద్ అర్బన్‌పై కవిత ఫోకస్..పోరు రసవత్తరం.!

-

రాజకీయాల్లో ఏ నాయకుడుని ఎక్కడ ఉపయోగించుకోవాలి. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనే అంశం కే‌సి‌ఆర్‌కు బాగా తెలుసు. తన వ్యూహాలతో ప్రత్యర్ధులకు ఎలా చెక్ పెట్టాలనేది కే‌సి‌ఆర్‌కు ఇంకా బాగా తెలుసు. ఇక నాయకులని అవసరానికి తగ్గట్టుగా వాడుకుని..వారిని గెలుపు తీరాలకు చేరుస్తూ ఉంటారు. కానీ గత ఎన్నికల్లో తన కుమార్తె కవితని గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. నిజామాబాద్ పార్లమెంట్ లో ఆమె ఓడిపోయారు.

అయితే ఈ సారి కవితని ఖచ్చితంగా గెలిపించాలనే కసితో కే‌సి‌ఆర్ ఉన్నారు. కూతురుని గెలిపించుకోలేకపోయారనే ముద్రని పోగొట్టుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమెని మొదట అసెంబ్లీ ఎన్నికల బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కాకపోతే ఆమెని ఏ సీటులో బరిలో దించాలనేది క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే జగిత్యాలలో పోటీ చేస్తారని ప్రచారం వచ్చింది. ఆ మధ్య ముషీరాబాద్ లో పోటీ చేస్తారని టాక్ నడిచింది. ఇలా ఆమె పోటీ చేసే నియోజకవర్గాలపై కన్ఫ్యూజన్ ఉంది.

తాజాగా ఆమె నిజామాబాద్ అర్బన్ లో పోటీ చేస్తారని కథనాలు వస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ అనేది ఒకప్పుడు కాంగ్రెస్, టి‌డి‌పిలు పోటాపోటిగా గెలిచేవి. కానీ గత రెండు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ గెలుస్తుంది. బి‌ఆర్‌ఎస్ నుంచి గణేశ్ గుప్తా గెలుస్తున్నారు. అయితే ఈ సారి ఆయన మళ్ళీ పోటీ చేస్తే బి‌జే‌పి, కాంగ్రెస్ ల నుంచి గట్టి పోటీ ఎదురుకోవాలి. ఈ నేపథ్యంలో ఇక్కడ కవితని బరిలో దింపితే వార్ వన్‌సైడ్ అవుతుందని, పైగా ఆ ప్రభావం నిజామాబాద్ జిల్లాపై ఉంటుందని కే‌సి‌ఆర్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక కవిత బరిలో ఉంటానంటే గణేశ్ సైడ్ అవ్వడానికి రెడీగానే ఉంటారు. కానీ ఆమెని పోటీకి దింపుతారా? లేదా? అనేది పూర్తి క్లారిటీ లేదు. పోటీకి దింపితే మాత్రం ఫలితం మారుతుంది. చూడాలి మరి చివరికి కవితని ఎక్కడ పోటీకి దింపుతారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version