కవితకు అక్కడికి పంపిస్తారా…? మరి ఆయన పరిస్థితి ఏంటి…?

-

తెలంగాణా అధికార తెరాస లో రాజ్యసభ సీటుకి సంబంధించి చర్చ జరుగుతుంది. కెసిఆర్ పెద్దల సభకు ఎవరిని పంపిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలోనే రెండు పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఒకటి నిజామాబాద్ మాజీ ఎంపీ, కెసిఆర్ కుమార్తె కవిత, రెండు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి… ఈ ఇద్దరి పేర్లు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చకు దారి తీసాయి.. కవిత నిజామాబాద్ నుంచి పోటి చేసి… ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాల్లో గాని, 

పార్టీ సమావేశాల్లో గాని తక్కువగా పాల్గొంటున్నారు. రాజకీయంగా తెరాస పార్టీ బలంగా ఉన్నా సరే కవిత ఓటమి ఆ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అనే చెప్పాలి. కెసిఆర్ కుమార్తె ఓడిపోవడం ఏంటి అనే చర్చ పార్టీలో ఇప్పటికి జరుగుతూనే ఉంది. ఇక పొంగులేటి విషయానికి వస్తే ఆయన పార్టీ మారతారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతున్నా ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పష్టతా రాలేదు. ఖమ్మం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు కి కెసిఆర్ అవకాశం ఇవ్వడంతో పొంగులేటి కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు.

రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన్ను కెసిఆర్ మోసం చేసారని ఆయన వర్గం ఆరోపించింది. ఇప్పుడు కెసిఆర్ ఆయనకు న్యాయం చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజ్యసభ కు ఆయన్ను పంపించే అవకాశం ఉందీ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని నామా ద్వారా పొంగులేటికి చెప్పేశారని అంటున్నారు. ఇక ఇదే సమయంలో కవిత పేరు కూడా వినపడుతుంది. కవితను ఢిల్లీ పంపాలని కెసిఆర్ భావిస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే రాజకీయంగా బిజెపి దృష్టి పెడుతుంది కాబట్టి… కవిత విషయంలో కెసిఆర్ అటు ఇటుగా ఆలోచిస్తున్నారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించడమే కాకుండా బలమైన వర్గం ఉన్న పొంగులేటిని టార్గెట్ చేసి తమ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందని కెసిఆర్ భావిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version