కే‌సి‌ఆర్ వ్యాఖ్యల పట్ల మోడి రియాక్షన్ ఏంటి ?

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలవడంతో మోడీ సర్కార్ పై అదేవిధంగా ఆయన తీసుకువచ్చిన పౌర సవరణ చట్టం (సీఏఏ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ దేశానికి మంచిది కాదని 100% తప్పుడు నిర్ణయం అని రాజ్యాంగం దేశంలో ఉన్న ప్రజలందరినీ సమానంగా చూస్తోందని అలాంటి సమయంలో ముస్లిం వర్గాల ప్రజలను మాత్రం పక్కన పెడితే దాని అర్థం ఏమిటని ఇది నాకు బాధ కలిగించిందని ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి కూడా ఫోన్ చేసి చెప్పినట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

అంతేకాకుండా కేవలం హిందూ మతానికి కొమ్ము కాస్తూ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని మోడీ చూస్తున్నారంటూ ఇటీవల మేధావులు కామెంట్ చేస్తున్నారు అటువంటి చర్యల వల్ల దేశంలో ప్రజల మధ్య గొడవలు తప్ప మరేమీ ఉండదని నా కంటే గొప్ప హిందువు దేశంలోనే ఉండరని పొద్దున లెగిస్తే గాయత్రి మంత్రం జపిస్తూ మేల్కొంటాను…నేను చేశాను యాగాలు ఎవరు చేయలేదు అంటూ టిఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు.

 

దీంతో కెసిఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మోడీ షాక్ అయినట్లు గతంలోనే ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని ఆ ఆలోచన నుండి విరమించిన కెసిఆర్ రాబోయే రోజుల్లో తనకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేస్తాడని మోడీ అంచనా వేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి.  

 

Read more RELATED
Recommended to you

Exit mobile version