ఎమ్మెల్యేల కొనుగులు కేసు..కేసీఆర్‌కు రివర్స్ షాకులు!

-

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ చెందిన ముగ్గురు వ్యక్తులు కొనుగోలు చేయడానికి చూడటం..పోలీసులత్ప్ పకడ్బంధీగా ప్లాన్ చేసి..ఆ ఎమ్మెల్యేలు..కొనుగోలుకు ప్రయత్నిస్తున్న వారిని పట్టుకోవడం, వారి అరెస్ట్, బెయిల్ పై బయటకు రావడం జరిగిపోయాయి. అయితే ఈ కేసు ద్వారా..గతంలో ఓటుకు నోటు కేసు ద్వారా తెలంగాణలో టీడీపీని ఎలా దెబ్బతీశారో..ఆ విధంగా బీజేపీని ఇరికించాలని కేసీఆర్ ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

కానీ అప్పుడు వర్కౌట్ అయింది గాని..ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ముందుగానే కొనుగులోకు సంబంధించి ఆడియో, వీడియోలని కేసీఆర్..ఏదో సినిమా వేసినట్లు మీడియా ముందు వేయడం చేశారు. ఇదే నిందితులకు అడ్వాంటేజ్ అయింది..ఈ కేసు తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉన్న సిట్ విచారణ చేస్తే తమకు న్యాయం జరగదని, సీబీఐకి ఈ కేసు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. హైకోర్టు సింగిల్ బెంచ్..దీనిపై విచారణ చేసి..కేసు సీబీఐకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సీబీఐకి ఇవ్వడంపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది..ప్రస్తుతం అక్కడ విచారణ జరుగుతుంది. కానీ ఆ విచారణలో ఊహించని అంశాలు తెరపైకి వచ్చాయి. నిందితుల తరుపున న్యాయవాదులు సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. 2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్లారని, ఇక కేసు వేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సైతం..కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలనే అని కోర్టుకు వివరించారు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించి ఇంత మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న వారు ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఎలా మాట్లాడతారని కేసీఆర్‌ని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు.

ఇలా కోర్టులో నిందితుల తరుపు న్యాయవాదులు వాదించడం ఒక వైపు జరిగితే..మరోవైపు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్‌కే రివర్స్ షాకులు తగిలే పరిస్తితి వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version