ఏపీలో కేసీఆర్‌తో కలిసొచ్చేదెవరు..పక్కా ప్లాన్‌తో సభ.!

-

ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ ఆవిర్భావ సభని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో సభకు ప్రజలని తరలించారు. సభకు జాతీయ నేతలు కూడా రావడంతో..జాతీయ స్థాయిలో బి‌ఆర్‌ఎస్ సభ హైలైట్ అయింది. ఇక సభలో ప్రతి ఒక్కరూ బీజేపీనే టార్గెట్ చేసి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్..ఆద్యంతం మోదీ సర్కార్ ని టార్గెట్ చేసి మాట్లాడారు. అలాగే బి‌ఆర్‌ఎస్ వస్తే ఏం చేస్తుందనేది కూడా చెప్పుకొచ్చారు.

ఇక ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో తర్వాత బి‌ఆర్ఎస్ సభ ఏపీలో నిర్వహించడానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ బి‌ఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్..త్వరలో విశాఖలో భారీ సభకు ప్లాన్ చేస్తున్నామని, త్వరలోనే తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పారు. అయితే విశాఖ వేదికగా సభ జరుగుతుందని అర్ధమవుతుంది. ఈ సభ ద్వారా కేసీఆర్..ఏపీలో కూడా పార్టీ బలం పెంచేలా వ్యూహాలు రచించనున్నారు. అలాగే ఇంకా కొందరు కీలక నేతలని బి‌ఆర్‌ఎస్ లో చేర్చుకొనున్నారు.

అయితే ఉత్తరాంధ్రలో కేసీఆర్ సొంత సామాజికవర్గం వెలమలు ఎక్కువగా ఉంటారు. వారి మద్ధతు పొందడానికి కే‌సి‌ఆర్ విశాఖలో సభ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అదేవిధంగా బి‌జే‌పిని టార్గెట్ చేస్తూనే..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పనున్నారు. దీని ద్వారా స్టీల్ ప్లాన్ ఉద్యోగులు, వారి కుటుంబాల మద్ధతు పొందడంతో పాటు..ఏపీలో కమ్యూనిస్టుల సపోర్ట్ కూడా తీసుకోవాలని చూస్తున్నారు.

ఎలాగో తెలంగాణలో కమ్యూనిస్టులు కే‌సి‌ఆర్‌కు మద్ధతు తెలిపాయి. ఏపీలో కూడా కమ్యూనిస్ట్ పార్టీల మద్ధతు తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే పక్కా వ్యూహం ప్రకారమే విశాఖలో సభ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి కే‌సి‌ఆర్ ప్లాన్స్ ఏ మేర వర్కౌట్ అవుతాయో.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version