పార్టీలో ఉద్యమ పంథా పెంచేందుకు సిద్దమైన కేసీఆర్.. కీలక వ్యక్తులకు బాధ్యతలు..

-

పదేళ్ల పాటు.. తెలంగాణాని ఏలిన బీఆర్ ఎస్ ఇప్పుడు కష్టాల్లో ఉంది..ఓ వైపు కాంగ్రెస్ నేతల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటూనే.. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని కట్టడి చేస్తోంది.. ఇదే సమయంలో పార్టీని బలోపేతం చెయ్యడంతో పాటు.. నేతల్లో జోష్ నింపేందుకు గులాబీ బాస్ కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత.. పార్టీ పునర్నిర్మాణం పై ఆయన ఫోకస్ చేశారట..

పార్టీ శ్రేణుల్లొ ఉత్సాహం నింపేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. ఈ మేరకు గ్రామస్థాయి నేతల నుంచి జిల్లా స్థాయి నాయకుల దాకా అందరికీ శిక్షణ ఇవ్వాలని సిద్దమవుతున్నారట.. స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో పట్టు నిలుపుకునేందుకు పక్కా ప్లాన్ తో ఆయన ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది..

శిక్షణతో పాటు.. సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారనే చర్చ నడుస్తోంది.. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డికి పార్టీ కార్యాలయ కార్యదర్శి గా కీలక బాధ్యతలు అప్పగించారట. తెలంగాణ వ్యవహారాలను, కేటీఆర్ కు, సెంట్రల్ తెలంగాణ పార్టీ బాధ్యతలను హరీష్ రావుకు కట్టబెట్టినట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.మరో సీనియర్ నేత ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డికి దక్షిణ తెలంగాణ బాధ్యతలు అప్పగించి మూడు ప్రాంతాలకు ముగ్గురు ఇన్చార్జీలను నియమించాలనే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారట.పార్టీని పక్కా ప్లాన్ తో బలోపతం చేసేందుకు కేసీయార్ ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version