రాజకీయాల్లో యువత పవర్ గురించి చెప్పాల్సిన పని లేదు. వారు తల్చుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. అందుకే ఏ రాజకీయ పార్టీ అయిన యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఒకవేళ వారిని గాని నిర్లక్ష్యం చేస్తే సీన్ రివర్స్ అవుతుంది. ఎన్నికల్లో వారి సత్తా ఏంటో చూపిస్తారు. 2014లో జాబు కావాలంటే బాబు రావాలని టిడిపి ప్రచారం చేసి. యువతని ఆకట్టుకుని ఓట్లు వేయించుకుని గెలిచి అధికారంలోకి వచ్చింది.
కానీ అధికారంలోకి వచ్చాక యువతని పట్టించుకోలేదు. ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగ భృతి ఎప్పుడో 2019 ఎన్నికల ముందు ఇచ్చారు. దీంతో ప్రజలు టిడిపిని నమ్మలేదు. 2019లో వైసీపీకి ఓటు వేశారు. ఇప్పుడు వైసీపీ గాని యువతకు న్యాయం చేయకపోతే సీన్ మారిపోతుంది. ఏపీ విషయం పక్కన పెడితే..తెలంగాణ రావడంలో నిధులు, నియమకాలు, నీళ్ళు అనే అంశాలు కీలకం. అందులో నియమకాలు,..తెలంగాణ వస్తే అక్కడ ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వస్తుందని అంతా అనుకున్నారు.
కానీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసిఆర్..నిరుద్యోగుల విషయం పెద్ద పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఇటీవలే కాస్త జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. వాటిల్లో కూడా పేపర్ లీక్స్ అంటూ రచ్చ జరుగుతుంది. అలాగే 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తామని కేసిఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు హామీ అమలు చేయలేదు. మళ్ళీ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. దీంతో యువత బిఆర్‌ఎస్‌కు యాంటీగా ఉన్న విషయం అర్ధం చేసుకున్నారు.
ఇప్పటికే ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని బిసి, మైనారిటీలకు సాయం, రైతు రుణమాఫీలని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ భృతి కూడా ఇస్తారని తెలిసింది. కానీ ఎన్నికల ముందు ఈ స్కీమ్ ఇవ్వడం వల్ల యువత ఎంతమంది నమ్ముతారు..బిఆర్‌ఎస్‌కు మళ్ళీ సపోర్ట్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి. e