ఢిల్లీకి బానిసలం కావొద్దు..

-

తమిళులను ఆదర్శంగా తీసుకుని పాలన చేసుకుందాం..

తెలంగాణలోని కొన్ని పార్టీలు ఢిల్లీకి బానిసలుగా చెంచాగిరి చేయాలని చూస్తున్నారంటూ తెరాస అధినేత కేసీఆర్  పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన వేదిక ద్వారా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్ గురించి ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేడు.. గత పాలకులు తెలంగాణ పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించారు. చిమ్మ చీకట్లు కమ్ముకున్న రాష్ట్రాన్ని 24 గంటల విద్యుత్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చాం…  రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రం ఇస్తోంది. ఇంటింటికీ నీళ్లు, రైతు బంధు పథకం, రైతు బీమా పథకం అమలు చేస్తున్నాం.. తెలంగాణ సాధనలో అణువణువు ఎంతో నిషితంగా పరిశీలించి

రేయిబవళ్లు హోం వర్క్ చేశాను. రాష్ట్ర సాధన కోసం దేశంలో 36 పార్టీల మద్దతు సాధించాను. ఓ కమ్యూనిస్టు నాయకుడిని ఒప్పించడం కోసం ఏడాది పాటు ఆయన చుట్టూ తిరిగాను. అలాంటి రాష్ట్రంలో కేంద్ర వేలు పెట్టడం మంచి పద్ధతి కాదు, రాష్ట్రంలో నేతలు ఢిల్లీకి బానిసలుగా వ్యవహరించాలని చూస్తున్నారు.. నా పద్ధతి అది కాదు. కనీసం వాళ్ల ఎమ్మెల బీ – ఫార్ములు సైతం ఢిల్లీ పెద్దలు నిర్ణయించాల్సిందే అన్నారు.

మీడియాలో వస్తున్నట్లుగా తాను ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు, ప్రజలకు హామీలు ఇవ్వనున్నట్లు వచ్చిన వార్తలపై త్వరలోనే క్లారిటీ ఇస్తాను. ప్రభుత్వ అధినేతగా తాను ఎలాంటి నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోలేనని ప్రకటించారు. కేశవరావు సారధ్యంలో మెనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తున్నాము.. మెనిఫెస్టోలో ప్రజలకు ఇంకేం చేయాలనే విషయాలను వెల్లడిస్తామన్నారు.

మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందాం… ఈ విషయంలో తమిళులను ఆదర్శంగా తీసుకోవాలి… వాళ్లు ఇతరులకు అవకాశం ఇవ్వరు వాళ్ల రాష్ట్రాన్ని వాళ్లే పాలించుకుంటారు. తెరాస చేసిన పనులు మీకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.. రానున్న ఎన్నికల్లో మీరు మళ్లీ ఓట్లేసి గెలిపిస్తే మరింత ఉత్సాహంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలుపుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news