ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో రాష్ట్రంలో ఈ ఎన్నికలపై ఇప్పుడు అనేక అంచనాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని,
అది స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇక ప్రభుత్వంలో కూడా ఈ విషయంలో కాస్త ఆందోళన నెలకొంది. ఎం జరుగుతుందో ఏమో అనే భయం జగన్ లో కూడా ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన కెసిఆర్ వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను,
ముఖ్యమంత్రి మంత్రులకు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణాలో కెసిఆర్ మంత్రులకు అప్పగించి గెలవకపోతే పదవులు పోతాయని హెచ్చరించారు. ఇప్పుడు జగన్ కూడా తన కేబినేట్ మంత్రులకు ఇదే విషయాన్ని స్పష్టం చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో పార్టీ సమావేశం తాడేపల్లిలో జరుగుతుందని ఆ సమావేశంలో జగన్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనితో మంత్రులలో కెసిఆర్ వ్యూహం టెన్షన్ నెలకొంది.