సవాల్ కు స్పందిస్తావా.. సైడైపోతావా అచ్చెన్నా?

-

“ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయని నిరూపించడానికి అక్కడికీ ఇక్కడీ ఎక్కడికో వెళ్లడం ఎందుకు… స్వయంగా నీ స్వగ్రామం నిమ్మాడలోనే బహిరంగ చర్చ పెడదాం.. ప్రభుత్వ పథకాలు తమకు అందాయో లేదో అనే విషయాన్ని నిమ్మాడ ప్రజలనే అడుగుదాం.. అందుకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా” అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి సవాల్‌ విసిరారు. కరోనా భయంతో ఇంతకాలం హోమ్‌ క్వారంటైన్‌ కే పరిమితమైన అచ్చెన్నాయుడు ఈ రోజు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని జూమ్‌ యాప్‌ లో రాజకీయ ఉనికి చాటుకుంటున్నారని, అంతకు మించిన హాస్యాస్పదం మరోకటి లేదని అంటున్నారు కిల్లి కృపారాణి.

సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా అందలేదని నిరూపించగలరా అని ప్రశ్నించిన కృపారాణి… పథకాల్లో అధికంగా టీడీపీ నాయకుల కుటుంబాలే లబ్ధి పొందుతున్నాయని.. అచ్చెన్నాయుడు సొంత గ్రామమైన నిమ్మాడలో అమ్మఒడి, రైతు భరోసా, విద్యాదీవెన పథకాలు అందలేదని నిరూపించగలరా అని సూటిగా ప్రశ్నించారు. దీనిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేసిన కృపారాణి… సీఎంపై లేనిపోని విమర్శలు చేస్తే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

కాగా… పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ దొంగమాటలు చెబుతున్నారని.. రాష్ట్రంలోని ఏ గ్రామనికైనా తాను వస్తానని, ఈ విషయంపై సర్కార్ చర్చకు సిద్ధమేనా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించిన్స్ సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల దగ్గర నుంచి అన్ని పథకాలను వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. ఆ ఆరోపణలకు తాజాగా కృపారాణి స్పందించారు! మరి ఈ ప్రతిసవాల్ కి అచ్చెన్న స్పందిస్తారా.. లేక, అదేదో మహానాడు వేడిలో అన్న మాటలు అని సైలంట్ అయ్యి సైడపోతారా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news