కరోనాపై విజయం సాధించడానికి మనం మరింత శ్రమించాలని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఆయన దేశ ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు. ప్రజలు ఇప్పుడు స్వదేశీ వస్తువులనే కొంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల కోసం పనిచేస్తున్నాయన్నారు. ఆత్మ నిర్భర భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నామన్నారు. కరోనా సంక్షోభంలో బాగా ఇబ్బంది పడింది వలస కూలీలేనని మోదీ అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలతో తాను కరోనా సంక్షోభంపై మాట్లాడానని మోదీ తెలిపారు. కోవిడ్ 19పై పోరులో యోగా సహకరిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచే సత్తా యోగాకు ఉందన్నారు. కరోనా కష్టకాలంలో మహిళా సంఘాలు మాస్కులను తయారు చేసి సహాయం చేశాయన్నారు.
ప్రపంచ దేశాధినేతలతో తాను కరోనాపై మాట్లాడినప్పుడు వారు యోగా, ఆయుర్వేదం గురించి తనను అడిగారని మోదీ తెలిపారు.