Fact Check: కరోనా మాస్కులు ఎక్కువసేపు ధరిస్తే ఆక్సిజన్‌ లభించక స్పృహ తప్పుతారా ?

-

కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులను ధరిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే మాస్కులను ఎక్కువ సమయం పాటు ధరిస్తే.. ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోయి.. స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుందని.. పలు వార్తలు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఇంతకీ అసలు ఇందులో నిజమెంత ? నిజంగానే మాస్కుల వల్ల మనకు ఆ ప్రమాదం కలుగుతుందా ? అంటే…

fact check does prolonged wearing of corona mask really causes suffocation

మాస్కులను ఎక్కువ సమయం పాటు ధరించడం వల్ల ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుందని, తద్వారా స్పృహ కోల్పోతారనే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే మాస్కులను మరీ అంత టైట్‌గా ధరించరు. కాస్త వదులుగానే ఉంటాయి. అందువల్ల గాలి ఆడుతుంది. కాకపోతే శ్వాస తీసుకోవడం, వదలడం కొందరికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది.. అంతే.. కానీ.. వాటి వల్ల మనకు గాలి ఆడదనే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే అలాంటి పుకార్లను నమ్మి వ్యాధులను కొని తెచ్చుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news