కోడెల రాజ‌కీయ ప్ర‌స్థానం… విజ‌యాలు… అప‌జ‌యాలు

-

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ (72) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కోడెల తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా.. గత కొన్ని రోజులుగా వార‌సుల తీరుతో పాటు త‌న‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్న ఆయ‌న ఈ చ‌ర్య‌కు పాల్పడ్డారు. కోడెల రాజ‌కీయ ప్ర‌స్థానం.. ఆయ‌న గెలుపు, ఓట‌ములు ఇలా ఉన్నాయి.

1947 మే 2 = గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో జ‌న‌నం

1982 = ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిక‌

1983 = న‌ర‌సారావుపేట నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌

1985 = రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపు

1989 = కాంగ్రెస్ గాలిలోనూ గెలిచి హ్యాట్రిక్‌

1994 = నాలుగోసారి ఘ‌న విజ‌యం

1999 = ఐదోసారి గెలుపుతో వ‌రుస‌గా తిరుగులేని విజ‌యాలు

2004 = కాంగ్రెస్ ప్ర‌భంజంలో తొలిసారి ఓట‌మి

2009 = రెండోసారి వ‌రుస‌గా కాసు వెంక‌ట కృష్ణారెడ్డి చేతిలో ఓట‌మి

2014 = స‌త్తెన‌ప‌ల్లికి మారి అక్క‌డ నుంచి ఆరోసారి అసెంబ్లీకి ఎన్నిక‌

2019 = అంబ‌టి రాంబాబు చేతిలో ఓట‌మి

చేప‌ట్టిన ప‌ద‌వులు 

– 1987-88 మధ్యలో హోంమంత్రి

– 1996-97 భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రి

– 2014-19 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news