కాంగ్రెస్ అనూహ్య పరిణామాలో చోటుచేసుకుంటున్నాయి. రేవంత్‌ను టీపీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో ఎన్ని వివాదాలు తెరమీదకు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక రేవంత్‌కు టీపీసీసీ చీఫ్ ఇవ్వొద్దంటూ ఎంతోమంది సోనియా గాంధీకి లేఖలు కూడా రాసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మాత్రం అవేవీ పట్టుకోకుండా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. కాగా రేవంత్‌కు పగ్గాలు ఇవ్వడంతో ఎంతోమంది సీనియర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే డైరెక్టుగానే విమర్శలు చేశారు.
కానీ ఇవేవీ పట్టించుకోకుండా రేవంత్ తన పని తాను చేసుకుంటూ పోవడంతో వరుసగా ఒక్కొక్కరు కలిసి వస్తున్నారు. ఇక ఇదే క్రమంలో 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహించబోయే దళిత, గిరిజన దండోరా బహిరంగ సభ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి కూడా కొంత తగ్గి రేవంత్ కు ఫోన్ చేసి మరీ మాట్లాడారనే వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్టు వచ్చి పడింది. అదేంటేం కోమటిరెడ్డికి ఈ విషయంపై సమాచారమే లేదంట.
తాను ఫోన్ చేసినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అంతే కాకుండా తన నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభ గురించి తనకు మాట కూడా రేవంత్ చేప్పలేదని వాపోతూ ఈ విషయమై ఏకంగా సోనియా గాంధీకే వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేస్తూ లేఖను రాయడం సంచలనం రేపుతోంది. ఈ వార్తలతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పటి వరకు రేవంత్, కోమటిరెడ్డి ఒక్కటైపోయారనుకున్న వారంతా ఈ వార్తతో షాక్ అవుతున్నారు. ఇక మాణిక్యం ఠాగూర్ కూడా ఈ వ్యవహారంలో రేవంత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.